యాదగిరి గుట్ట ఆలయంలోకి సెల్ ఫోన్ల నిషేదం.. ఇకపై వారికి కూడా!
యాదగిరి గుట్ట ఆలయంలోకి సెల్ ఫోన్లు అనుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
దిశ, డైనమిక్ బ్యూరో: యాదగిరి గుట్ట ఆలయంలోకి సెల్ ఫోన్లు అనుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి చరవాణిలను నిషేదిస్తూ.. తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబందనలు ఇదివరకే ఉన్నా.. అవి భక్తులకు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రధానాలయంలో విధుల నిర్వహించే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాల్గవ తరగతి, ఎస్.పి.ఎఫ్, హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు విలేకరులకు కూడా సెల్ ఫోన్స్ ఆలయంలోకి తీసుకొని వెళ్లకుండా నిలుపుదల చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన శాఖధిపతుల సమావేశంలో చర్చించి, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.