Burra Venkatesham: యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీని బలోపేతం చేస్తాం: చైర్మన్ బుర్రా వెంకటేశం

యూపీఎస్సీ(UPSC)కి దీటుగా టీజీపీఎస్సీ(TGPSC)ని బలోపేతం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-12-11 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: యూపీఎస్సీ(UPSC)కి దీటుగా టీజీపీఎస్సీ(TGPSC)ని బలోపేతం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) నిర్ణయం తీసుకున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన టీజీపీఎస్సీపై క్షుణ్ణంగా అధ్యయనం ప్రారంభించారు. అందులో భాగంగానే యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రీతి సుదాన్(Preeti Sudan)తో ఆయన ఫోన్ లో బుధవారం మాట్లాడినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే తీరు, రిక్రూట్మెంట్ సిస్టమ్ గురించి అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా అధ్యయనం చేసేందుకు ఈనెల 18న ఢిల్లీకి వెళ్తున్నట్లు, ఆరోజు యూపీఎస్సీ కమిషన్ సభ్యులను కలవనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈనెల 19వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్. గోపాల కృష్ణన్(S. Gopala Krishnan)తోనూ భేటీ అయ్యి రిక్రూట్ మెంట్ విధానాలపై చర్చించనున్నట్లు స్పష్టంచేశారు.

Tags:    

Similar News