లోన్‌యాప్ ఏజెంట్ల నిర్వాకం.. బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్

లోన్‌యాప్ ఏజెంట్ల నిర్వాకానికి మరో యువకుడు బలయ్యాడు. డబ్బుల కోసం వరుస ఫోన్‌లతో టార్చర్ చేసి యువకుడి బలవన్మరణానికి కారణమయ్యారు.

Update: 2024-02-27 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోన్‌యాప్ ఏజెంట్ల నిర్వాకానికి మరో యువకుడు బలయ్యాడు. డబ్బుల కోసం వరుస ఫోన్‌లతో టార్చర్ చేసి యువకుడి బలవన్మరణానికి కారణమయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా దుండిగల్ ఏరోనాటిక్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న మనోజ్ అనే యువకుడు ఒక యాప్ ద్వారా లోన్‌ తీసుకున్నాడు.

అయితే, అతనికి ఈఎమ్ఐ కట్టాలని పదే పదే ఫోన్‌లు చేసి టార్చర్ చేసినట్లు సమాచారం. చివరకు మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయని క్రమంలో అతని బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్‌లు చేసి విషయం చెప్పారు. దీంతో అవమానంగా ఫీలైన మనోజ్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. అనంతరం మనోజ్ మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News