హోం మంత్రికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్
రాష్ట్ర ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని సామాజిక ఉద్యమకారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని సామాజిక ఉద్యమకారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పాతబస్తీకి చెందిన సామాజిక ఉద్యమకారుడు షేక్ సయీద్ బవాజీర్ పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి బాధితుడు ఫోన్ చేశారని అన్నారు.
అయినా హోం మంత్రి కూడా పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలోనే షేక్ సయీద్ దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు. సామాజిక ఉద్యమకారుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక బాధితుడు షేక్ సయీద్ హోంమంత్రితో మాట్లాడిన ఆడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
నన్ను కొందరు దుండగులు చంపే ప్రయత్నం చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, హోం మంత్రి మహమూద్ అలీ గారికి గోడు వెళ్లబోసుకున్నా, హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్యకు గురయ్యాడు సామాజిక ఉద్యమకారుడు, షేక్ సయీద్ బవాజీర్. ఈ ఆడియో హోం మంత్రి తో బాధితుడు మాట్లాడినది. ఒక… pic.twitter.com/cNq6EgFcOq
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 14, 2023