'వెయ్యి పొర్లు దండాలు పెట్టిన గెలవలేరు'.. రాజాసింగ్ ఛాలెంజ్‌కు బీఆర్‌ఎస్ కౌంటర్ (వీడియో)

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీఆర్ఎస్‌కు మధ్య రాజకీయం ముదురుతోంది.

Update: 2023-02-11 08:09 GMT
వెయ్యి పొర్లు దండాలు పెట్టిన గెలవలేరు.. రాజాసింగ్ ఛాలెంజ్‌కు బీఆర్‌ఎస్ కౌంటర్ (వీడియో)
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీఆర్ఎస్‌కు మధ్య ఫైట్ ముదురుతోంది. రాజాసింగ్ చేసిన రూ.100 కోట్ల ఛాలెంజ్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. 'రాజాసింగ్ రూ.1000 కోట్లు పంచి, 1000 పొర్లు దండాలు పెట్టిన గోషామహల్ ప్రజలు ఆయన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు' అంటూ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలో ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.

కాగా మూడు రోజుల క్రితం రాజాసింగ్ మాట్లాడుతూ గోషామహల్‌లో మళ్లీ తానే గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ ప్రజలకు ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవరని అన్నారు. బీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఇక్కడ విజయం తనదే అని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తాను గెలిచి వస్తానన్నారు. రాజాసింగ్ చేసిన సవాల్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ నేతలు తాజాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజాసింగ్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం మరోసారి హీటెక్కింది. 

Tags:    

Similar News