ఆ విషయంలో న్యాయం జరిగే వరకు వదిలేది లేదు.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
రైతులను అరిగోస పెడుతోన్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదిలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) మండిపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్: రైతులను అరిగోస పెడుతోన్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదిలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంట పొలాల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం టేకులసోమారంలో సాగునీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయాయని, పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కిందని అన్నారు. నీటి నిర్వహణ పై అవగాహన లేక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టిందని, రైతులను అరిగోస పెడుతోన్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పోరాడుతూనే ఉంటుందని కవిత స్పష్టం చేశారు.