BRS: అవగాహనారాహిత్యం వల్లే ఈ దుస్థితి.. మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్

రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి(Failure Of Law And Order) ఇదొక ఉదాహరణ అని, అవగాహనారాహిత్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.

Update: 2024-11-11 13:04 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి(Failure Of Law And Order) ఇదొక ఉదాహరణ అని, అవగాహనారాహిత్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. వికారాబాద్ జిల్లా(Vikarabad District)లో రైతులు అధికారులపై దాడి(Farmers Attacking Officials) చేయడంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. దాడికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. దీనిపై రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం(Failure Of Administration), శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ అంటూ.. ఇవ్వాళ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వంత నియోజకవర్గం కొడంగల్‌(Kodangal)లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరగబడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు.

నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని, భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగిందని ఆరోపణలు చేశారు. అంతేగాక ఫార్మా సిటీకోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ముచేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందని, అక్కడ కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోందని, అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Government) త్వరలోనే భూస్థాపితం చేయనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News