BRS: ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం.. లగచర్ల నిందితులకు బెయిల్ పై హరీష్ రావు

లగచర్ల రైతులకు(Lagacharla Farmers) బెయిల్(Bail) రావడం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విజయమని(Victory) మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు.

Update: 2024-12-18 16:29 GMT
BRS: ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం.. లగచర్ల నిందితులకు బెయిల్ పై హరీష్ రావు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: లగచర్ల రైతులకు(Lagacharla Farmers) బెయిల్(Bail) రావడం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విజయమని(Victory) మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సహా లగచర్ల రైతులకు ఇవాళ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ స్పందించిన హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. 35 రోజుల తర్వాత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Former MLA Patnam Narendar Reddy) సహా లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ రావడం సంతోషకరమని అన్నారు. అలాగే ఇది కాంగ్రెస్(Congress) నిరంకుశత్వం పై రైతుల విజయమని, లగచర్ల గిరిజన బిడ్డలకు అడుగడుగునా అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ విజయమని, అన్నదాత చేతులకు బేడీలు వేసిన రేవంత్ సర్కారు పై తెలంగాణ ప్రజలు(Telangana People) సాధించిన విజయమని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మాసిటీ(Farma City) కోసం భూసేకరణకై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి సహా దాడిలో పాల్గొన్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News