బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి MLC తనయుడు!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి పార్టీ మారనున్నారు. మే 4వ తేదీన ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు దాదాపు ఖరారైంది.
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి పార్టీ మారనున్నారు. మే 4వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి గ్యాప్ ఏర్పడింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని దామోదర్ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దామాదర్ రెడ్డి చేరిక పట్ల సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనూహ్యంగా దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ చేరడానికి సిద్ధం కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా, దామోదర్ రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఆయనను ఒప్పించే బాధ్యత పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది.