BRS MLA రాజయ్య రాజీనామా చేయాలి: కాంగ్రెస్

అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్​మహిళా నాయకురాలు నీలం పద్మ డిమాండ్ చేశారు.

Update: 2023-03-11 15:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్​మహిళా నాయకురాలు నీలం పద్మ డిమాండ్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్​చేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్​ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడుతూ.. నవ్యను తన దగ్గరికి రాకుంటే గ్రామానికి వచ్చిన నిధులను ఇవ్వను అంటూ సర్పంచ్‌ను లొంగతీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అంటూ ఆమె ప్రశ్నించారు.

కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా రాజయ్య కోరిక తీర్చాలంటూ సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతుంటే, ఎమ్మెల్సీ కవిత మహిళల రక్షణ కోసం ఢిల్లీలో ఆందోళన చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఎంతోమంది మోసపోతున్నారని, ఈ పరిస్థితులకు చెక్ పడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల మహిళా నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News