BRS: బడ్జెట్ సమావేశాల వేళ.. బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.

Update: 2024-07-22 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. దీంతో సభలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం 22 మధ్యాహ్నం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పక హాజరు కావాలని పార్టీ నుంచి సమాచారం అందించారు.

ఈ సమావేశంలో 23 నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే సభలో జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ వైఫల్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించనున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వానికి నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News