BRS: ప్రతిష్టాత్మక కార్యక్రమం.. తిరగబడ్డ బీఆర్ఎస్ నేతలు (వీడియో)

తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్‌(KCR) ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్‌ 29వ తేదీని బీఆర్‌ఎస్‌(BRS) దీక్షా దివస్‌గా పాటిస్తోంది.

Update: 2024-11-29 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్‌(KCR) ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్‌ 29వ తేదీని బీఆర్‌ఎస్‌(BRS) దీక్షా దివస్‌గా పాటిస్తోంది. గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. నేటితో కేసీఆర్‌(KCR) ఆమరణ నిరాహార దీక్షకు దిగి 15 ఏళ్ళు పూర్తి కావొస్తుండటంతో పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేశారు.

ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన దీక్షా దివస్(Deeksha Diwas) కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సొంత కార్యకర్తలే ఎదురు తిరిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్(Methuku Anand) లెక్కచేయడం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)కి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో మధ్యలో ఆందోళన చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

Full View

Tags:    

Similar News