ప్రధాని వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి: వినోద్ కుమార్

అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ సభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఖండించారు.

Update: 2023-04-08 13:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ సభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఖండించారు. ప్రధాని మాటలు అవాస్తవమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం అనేకసార్లు కోరామని, కొత్తరైల్వే లైన్లతో పాటు ఇతర అంశాలపై అనేక లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనపై శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకైనా సంపూర్ణ నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎయిమ్స్ తెలంగాణ నిధులతో నిర్మిస్తున్నామని, జాతీయ రహదారులు విభజన చట్టప్రకారమే వస్తున్నాయని ఇందులో మోడీ క్రెడిట్ ఏమీ లేదన్నారు.

ప్రధాని కుటుంబ పరిపాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అమిత్ షా, రాజనాథ్ సింగ్, ఫడ్నవీస్, అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్,ధర్మేంద్ర ప్రధాన్, సిందియాలు ఎవరు? వారిదంతా వారసత్వ రాజకీయాలు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారని చెప్పారు. తెలంగాణ అవినీతి రాష్ట్రం అంటూ విమర్శలు చేసే ముందు కర్ణాటక, మహారాష్ట్రలో అవినీతి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. అత్యంత అవినీతి రాష్ట్రాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ సారైనా మోడీ కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించామని కానీ కొత్తగా ఏమి ప్రకటన చేయకుండానే వెళ్లిపోయారని విమర్శించారు.

Tags:    

Similar News