నిజంగా తట్టుకోలేడా.. పవన్ కల్యాణ్ నిజస్వరూపం బయటపెట్టిన తెలంగాణ నేత! (వీడియో)
సంపాదించిన డబ్బుల్లో నలుగురికి సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తులు ప్రస్తుత సమాజంలో చాలా అరుదుగా ఉంటారు.
దిశ, వెబ్‌డెస్క్: సంపాదించిన డబ్బుల్లో నలుగురికి సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తులు ప్రస్తుత సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. ఈ జనరేషన్‌లో అలాంటి వారి జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా వెనకడుగు వేయకుండా ప్రశ్నిస్తుంటాడు. బాధితుల పక్షాన ఉంటూ భరోసా నింపుతాడు. జనసేన పేరుతో పార్టీ పెట్టి దాదాపు పదేళ్లు గడుస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. స్వయంగా తానే పోటీ చేసిన రెండు చోట్టా ఓడినా బెదిరిపోకుండా పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం టీడీపీతో జతకట్టి 2024 అసెంబ్లీ ఎన్నికలకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మనస్తత్వానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన ఎలాంటి వాడో తెలంగాణ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాటల్లో చెబుతున్న వీడియో ఒకటి ట్విట్టర్(ఎక్స్)లో ట్రెండ్ అవుతోంది.
గతంలో ఆదిలాబాద్‌లోని ఓ ప్రాంతంలో తాగునీరు కోసం ప్రజలు అల్లాడుతున్న తీరు చూసి పవన్ కల్యాణ్ ఆవేదన చెందినట్లు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దాసోజు చెప్పారు. వారికి బోరు వేయించే వరకూ పవన్ భోజనం కూడా తినకుండా ఉన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందే అక్కడ నాలుగైదు బోర్లు వేసినా పడలేదని.. పవన్ కల్యాణ్ స్వయంగా వేసిన బోరు మాత్రం పడి.. అక్కడి ప్రజల దాహం తీర్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది పవన్ కల్యాణ్ ఒరిజినాలిటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రజల కోసం పస్తులుండే వ్యక్తి అని పోస్టులు పెడుతున్నారు.