BRS LEADER: జనగాం జిల్లా పేరు ఎప్పుడు మార్చుతారు?
జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారని.. ఇంకెప్పుడు పెడతారని బీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్(Budida Bikshamaiah Goud) ప్రశ్నించారు.
దిశ, వెబ్‌డెస్క్: జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారని.. ఇంకెప్పుడు పెడతారని బీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్(Budida Bikshamaiah Goud) ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు, ముఖ్యంగా గీత కార్మికులకు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. గీత కార్మికులకు ఏడు కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నా రేవంత్ రెడ్డి విడుదల చేయడం లేదని మండిపడ్డారు.
గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు ఇంకా పూర్తిగా మంజూరు చేయలేదని గుర్తుచేశారు. కేసీఆర్ హయంలో తయారు చేసిన మోకులనే ఇచ్చారని విమర్శించారు. గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంచుతామని కూడా హామీ ఇచ్చారని అన్నారు. ట్యాంక్ బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని.. జనగాం(Janagam) జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పారని.. ఇవన్నీ ఎప్పుడు చేస్తారని అడిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గౌడ కులస్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.