అత్యధిక నిధులున్న పార్టీగా బీఆర్‌ఎస్ గుర్తింపు

దేశంలో రిచ్చెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్‌ఎస్ గుర్తింపు పొందింది. తమ బ్యాంకు ఖాతాల్లో రూ.1449 కోట్లు ఉన్నట్లు ఆ పార్టీ .. ఎన్నికల కమిషన్‌కు తాజాగా.. నివేదించింది.

Update: 2025-02-01 03:06 GMT
అత్యధిక నిధులున్న పార్టీగా బీఆర్‌ఎస్ గుర్తింపు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో రిచ్చెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్‌ఎస్ గుర్తింపు పొందింది. తమ బ్యాంకు ఖాతాల్లో రూ.1449 కోట్లు ఉన్నట్లు ఆ పార్టీ .. ఎన్నికల కమిషన్‌కు తాజాగా.. నివేదించింది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రూ.120.14 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీకి రూ.1110 కోట్లు ఉండగా.. పార్లమెంట్​ఎన్నికలు ముగిసే నాటికి రూ.1449 కోట్లకు చేరుకున్నాయి. ఒక్కొక్క లోక్‌సభ అభ్యర్థికి రూ.95లక్షల చొప్పున .. 17 మందికి రూ.16.15 కోట్లను బీఆర్‌ఎస్ కేటాయించింది. ఎన్నికల ప్రచారం, క్యాంపెయిన్​ ఇతర ప్రచార సామగ్రి, బహిరంగ సభలు, కేసీఆర్​ ప్రచారం కోసం రూ.103.26 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. 2024 జూన్ నాటికి తమ పార్టీ వద్ద వివిధ బ్యాంకుల్లో రూ.1449.22 కోట్లు ఉన్నట్లు పార్టీ ప్రకటించింది.

బంజారాహిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్​ బరోడాలో రూ.840 కోట్ల బ్యాంకు ఫిక్స్‌డ్​ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. కోటిలోని ఎస్‌బీఐ‌లో ఫిక్స్‌డ్​ డిపాజిట్ల కింద రూ.510 కోట్లు ఉన్నాయి. ఈ రెండు బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్​డిపాజిట్ల రూపంలో రూ.1350కోట్లు ఉన్నాయి. ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్​ బరోడా వసంత్​ విహార్​ బ్రాంచిలో రూ.50.28 కోట్లు నిల్వ చేసింది. కోటిలోని ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో రూ.23.76 కోట్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్​ బరోడా బ్యాంకు ఖాతాలో రూ.13.37కోట్లు, అదే బ్యాంకులోని వేరొక అకౌంట్లో రూ.8.72 కోట్లు ఉన్నట్లు ఈసీకి తెలిపింది. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయం బ్యాంకు అకౌంట్లో రూ.30.47 లక్షల ఉన్నట్టు బీఆర్‌ఎస్ ప్రకటించింది.


Similar News