BRS: ఇది ప్రజాపాలననా? రౌడీ రాజ్యమా?.. మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్

ఇది ప్రజాపాలననా? రౌడీ రాజ్యమా? చెప్పాలని, బీఆర్ఎస్ నేతను బలవంతగా అరెస్ట్ చేయడం దారుణమని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2024-10-18 12:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇది ప్రజాపాలననా? రౌడీ రాజ్యమా? చెప్పాలని, బీఆర్ఎస్ నేతను బలవంతగా అరెస్ట్ చేయడం దారుణమని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ సభ్యుడిని అరెస్ట్ చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీటీసీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై.. కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాస్‌ను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేయడం అత్యంత హీనమైన చర్య అని మండిపడ్డారు. అలాగే పోలీసులు శ్రీనివాస్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి, గంటల పాటు తిప్పి చివరగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శ్రీనివాస్ ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నామని రాసుకొచ్చారు.



Similar News