సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. గత ఏడాది ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్‌ను ఫోర్జరీ చేసి

Update: 2024-05-01 15:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. గత ఏడాది ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్‌ను ఫోర్జరీ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. సీఎంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సంబంధించిన కాపీలను ఈసీకి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది మేలో 12న ఓయూ హాస్టల్ చీఫ్ వార్డెన్ ఓయూ హాస్టల్స్, మెస్ బంద్ పెడుతున్నామని, వాటర్, విద్యుత్ కొరత ఉందని సర్క్యూలర్ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో పేర్కొన్నారన్నారు.

వార్డెన్ ఇచ్చిన సర్క్యూలర్‌ను మార్చి(ఫోర్జరీ) చేసి తప్పుడు పోస్టు చేశారన్నారు. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, నీటికొరత, విద్యుత్ కొరత ఉందని తప్పుడు సంకేతం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో లబ్దిపొందాలనే దురుద్దేశ్యంతోనే తప్పుడు పోస్టు చేశారని ఆరోపించారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు కిందకు వస్తుందన్నారు. ఆర్టికల్ 324 ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

Read More...

సీఎం పదవికి రేవంత్ పనికి రాడు: ఎంపీ లక్ష్మణ్ ఫైర్ 

Tags:    

Similar News