BREAKING: సింగరేణికి బొగ్గు గనులు దక్కుకుండా చేసింది ఆ పార్టీలే.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు

సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-06-20 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ వేదికగా కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలంపాటను నిర్వహిస్తుందని అన్నారు. సింగరేణి సంస్థలో 42 వేల మంది రెగ్యూలర్, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు.

ఏనాడు ఉద్యోగులను పట్టించుకోని గత ప్రభుత్వం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. 2031-32 వరకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి నిలబెట్టుకోవాలన్నా.. ఉద్యోగుల మనుగడ కొనసాగాలన్నా కేంద్రం నిర్వహించే గనుల వేలంలో సింగరేణి యాజమాన్యం తప్పనిసరిగా కొత్త బొగ్గు గనులను సొంతం చేసుకోవాల్సిందేనని అన్నారు. లేని పక్షంలో సింగరేణి సంస్థ చరిత్రలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటిని కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఇస్తే బాగుండేది అన్నారు.

కానీ, 2015 సంవత్సరంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెండ్ రెగ్యూలేషన్ యాక్ట్-1957 యాక్ట్‌లో సవరణ తీసుకొచ్చి దేశంలో ఉన్న బొగ్గు గనులను అన్నింటిని ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇవ్వకుండా.. వేలంపాట ద్వారా ప్రైవేటు రంగ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేసిందన్నారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెండ్ రెగ్యూలేషన్ యాక్ట్-1957 యాక్ట్‌లో సవరణ బిల్లుకు పార్లమెంటు‌లో ఆనాడు బీఆర్ఎస్‌ కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.


Similar News