BREAKING: హుజూరాబాద్ నియోజవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్..

ములిగే నక్కపై తాడిపండు పడినట్లుగా ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.

Update: 2024-02-01 02:51 GMT
BREAKING: హుజూరాబాద్ నియోజవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ములిగే నక్కపై తాడిపండు పడినట్లుగా ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇటీవలే రాష్ట్రంలో అధికారం కోల్పోయి డీలా పడిన ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. ముసిసిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు అనే తేడా లేకుండా అన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎందరైంది. 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా మరికొంత మంది నేతలు తమకు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Tags:    

Similar News