BREAKING: కరీంనగర్ జిల్లాలో భారీ చోరీ.. ఏటీఎం‌ను ధ్వంసం చేసి రూ.8.64 లక్షలతో జంప్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటీఎం‌లను దోచుకునే దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు.

Update: 2024-03-18 15:45 GMT

దిశ, వెబ్‌డెస్క్/హుజూరాబాాద్: హుజురాబాద్ పట్టణంలోని కోర్టు ఎదురుగా ఉన్న ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రూ.8.64 లక్షలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం ఏటీఎం‌లో రూ.26 లక్షల రూపాయలు బ్యాంక్ పెట్టేసి వెళ్లారు. అయితే, సోమవారం తెల్లవారుజామున ఏటీఎంలోకి వెళ్లగా ఏటీఎం మిషన్‌ను దొంగలు కట్టర్లతో కట్ చేసి చిందర వందరగా ఉండగా పోలీస్‌లకు సమాచారం అందించారు. ఈ మేరకు లీసులు ఫోరెన్సిక్ సిబ్బందికి సమాచారం అందించి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, పోలీస్ స్టేషన్‌కు కూత‌వేటు దూరంలో ఏటీఎంలో దొంగతనం జరగడం గమనార్హం. ఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్, సీఐ రమేష్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..