BREAKING: విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డ అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ (Hyderabad) ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డ అన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీ (HICC)లో ఏఐ ఇంటర్‌నేషనల్ సదస్సు (AI International Conference)ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏఐ అనే థీమ్‌తో రెండు రోజుల పాటు సదస్సు కోనసాగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపం వ్యాప్తంగా 2వేల మంది పైగా ప్రతినిధఉలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్‌ను విడుదల చేశారు.
ఇప్పటికే ప్రభుత్వం 24 సంస్థలతో ఎంవోయూను కుదుర్చుకుని ఏఐ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ ఐటీ రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిచిందిని అన్నారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. ప్రపంచం అంతా నేడు ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఓ వైపు కొత్త టెక్నాలజీ ఆశ, భయం అనే రెండింటిని తీసుకొస్తుందని అన్నారు. కానీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ప్రపంచం ఎన్నటికి మారదని తెలిపారు. ఎవరో ఒకరి ఇన్నోవేషన్ ప్రపంచంతో పాటు ప్రజల జీవితాల్లో మర్పులు తెస్తుందని అన్నారు.
ఇటీవల కొత్త అవిష్కరణలతో ఉద్యోగాలు పోతాయనే బెంగ పట్టుకుందని తెలిపారు. కానీ, విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సంసిద్ధంగా లేదని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని అన్నారు. అనంతరం హెచ్ఐసీసీ (HICC)లో సీఎం రేవంత్‌రెడ్డితో జేపీల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐబీఎం ప్రెసిడెంట్ డానియల్ కాంబ్, యోటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ సీఈవోలు భీటీ అయ్యారు. ఈ మేరకు ఏఐ అభివృద్ధితో పాటు భవిష్యత్తు ఆవిష్కరణలపై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా హైదారాబాద్ నగరంలో జీపీయూ అధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చ జరిగింది.