Bandla Ganesh : బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష

సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేష్ కు బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-02-14 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేష్‌కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్లగణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.95లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు సైతం బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో కూడా బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఈ మేరకు తీర్పు వెల్లడించింది రూ.25లక్షల చెక్ బౌన్స్ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బండ్ల గణేష్ బెయిల్ కోసం అప్లై చేసుకోగా.. కండిషన్ బెయిన్‌ను కోర్టు మంజూరు చేసింది.

Tags:    

Similar News