BREAKING: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై పరువు నష్టం దావా.. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు దీపాదాస్ మున్షీ
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్లీ ఫైట్ మొదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్లీ ఫైట్ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ బెంజ్ కార్లు, డబ్బు తీసుకుని కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారంటూ బీజేపీ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వాఖ్యలపై అప్పట్లో దీపాదాస్ మున్షీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చూపించాలని, లేని పక్షంలో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే, ఆ వెనువెంటనే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఇన్నాళ్లు సైలెంట్ ఉన్న ఆమె మళ్లీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా తాను 'క్విడ్ ప్రోకో'కు పాల్పడినట్లుగా బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణలపై ఆమె పరువునష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టును వెల్లబోతున్నారు.