BREAKING: బొగ్గు గనుల వేలం సింగరేణికి ఉరి వేయడమే: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-21 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయెజనాల పట్ల కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సోయి లేదని మండిపడ్డారు. ఏకాభిప్రాయంతోనే సింగరేణి ప్రైవేటికరణకు ఆ రెండు పార్టీలు తేరలేపాయని ఆరోపించారు. నిన్నటి వరకు కలిసి వేలంపాటను నిర్వహిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం, కేటీఆర్ హెచ్చరికతో ఇవాళ మాట మార్చాడని అన్నారు. ఒకవేళ ప్రైవేటికరణ జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సింగరేణి గనుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. 


Similar News