BREAKING: నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం.. ప్రధానంగా ఆ అంశాలపైనే డిస్కషన్

జిల్లాల్లో పాలనపై సీఎం రేవంత్‌రె‌డ్డి మరోసారి ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రత, తదితర వ్యహరాలపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు.

Update: 2024-07-16 02:10 GMT
BREAKING: నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం.. ప్రధానంగా ఆ అంశాలపైనే డిస్కషన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జిల్లాల్లో పాలనపై సీఎం రేవంత్‌రె‌డ్డి మరోసారి ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రత, తదితర వ్యహరాలపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్, డీజీపీలు కూడా హాజరు కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ప్రభుత్వం పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అధికారులతో చర్చించనున్నారు. పథకాల అమలుపై వ్యవహరించాల్సిన తీరుపై సీఎం కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయ కాలానుగుణ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవంపై చర్చ జరగనుంది. మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, భద్రతా సంబంధిత సమస్యలు, యాంటి డ్రగ్ క్యాంపెయిన్ వంటి అంశాలపై సమీక్ష కొనసాగనుంది.

Tags:    

Similar News