బ్రేకింగ్ : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్
ఎన్నికల వేళ కేంద్రం గ్యాస్ గృహ వినియోగదారులకు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉజ్వల యోజన డొమెస్టిక్ గ్యాస్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేట్లుగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశ వివరాను ఆయన మీడియాకు వెల్లడించారు. ఉజ్వల యోజన గ్యాస్ లబ్ధిదారులకు ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ పై రూ. 200 సబ్సిడీ ఇస్తుండగా దానిని ఈ సమావేశంలో రూ.300కు పెంచినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉజ్వల గ్యాస్ సిలిండర్ ధర రూ.903 ఉండగా ఈ సబ్సిడీతో ఉజ్వల లబ్ధిదారులకు ఇకనుంచి రూ.603కే సిలిండర్ లభించనుంది. త్వరలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ కానుందని మంత్రి తెలిపారు. క్యాబినెట్ తాజా నిర్ణయంతో దేశంలో 10 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. కాగా 2016లో కేంద్రం ప్రధాన మంతి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేసింది.