BREAKING: తెలంగాణలో బీజేపీకి రెండంకెల సీట్లు రావడం పక్కా: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెల సీట్లు ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Update: 2024-04-17 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెల సీట్లు ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ రిపోర్టులు ఇస్తున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా 235 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమిని చవిచూడబోతున్నారంటూ బాంబు పేల్చారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కవాలని కలలు కంటున్నాడని, అదే అయ్యే పని కాదన్నారు. తెలంగాణలో బీజేపీ రెండంకెల సీట్లు రావడం పక్కా అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ కొనసాగుతోందని, ప్రజలకు మభ్యపెట్టేందుకే డూప్ ఫైట్ చేస్తున్నాయంటూ ఆరోపించారు.

లోక్‌‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకే సీఎం రేవంత్‌ రెడ్డి ఆగస్టు 15 వరకు రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ అని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న ఏకకాలంలో రుణ మాఫీ చేస్తా చెప్పారని వంద రోజుల పాలన పూర్తయిన అమలు చేయలేక విఫలమయ్యారని విమర్శించారు. వరి పంటకు మద్దతు ధర‌తో పాటు రూ.500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఏమి చేయలేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రంలో బీజేపీ జైత్రయాత్రను ఆపలేరని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News