Bomb Threat: సికింద్రాబాద్‌-నాగ్‌పూర్ వందే భారత్‌కు బాంబు బెదిరింపు..

ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఫ్లైట్లలో బాంబు పెట్టామంటూ ఈ మధ్య ఆకతాయిల ఫోన్ కాల్స్ పోలీసులకు తలనొప్పిగా మారాయి.

Update: 2024-10-07 15:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఫ్లైట్లలో బాంబు పెట్టామంటూ ఈ మధ్య ఆకతాయిల ఫోన్ కాల్స్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఆయా పరిణామలతో ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా, సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ (Secunderabad-Nagpur) వందే‌‌భారత్‌ (Vande Bharath) ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడం కలకలం రేపింది. రైలులో బాంబు ఉందని ఓ ఆజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందజేశాడు. ఈ మేరకు స్పందించిన పోలీసులు హుటాహుటిన బాంబు, డాగ్ స్క్వాడ్‌ (Bomb & Dog Squad)తో ఘటనా స్థలానికి చేరుకుని ట్రైన్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. అయితే, రైలులో ఎలాంటి బాంబు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు కాల్ చేసిన వ్యక్తి లింగంపల్లి (Lingampally)కి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


Similar News