Telangana Spicy Kitchen: జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి భారీ పేలుడు

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో (Telangana Spicy Kitchen Restaurant) పెద్దశబ్దంతో పేలుడు జరగ్గా.. మంటలు చెలరేగాయి.

Update: 2024-11-10 02:27 GMT
Telangana Spicy Kitchen: జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి భారీ పేలుడు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో (Telangana Spicy Kitchen Restaurant) పెద్దశబ్దంతో పేలుడు జరగ్గా.. మంటలు చెలరేగాయి. వస్తువులన్నీ చెలాచెదురయ్యాయి. ఈ పేలుడు ధాటికి సమీప బస్తీలో రాళ్లు ఎగిరిపడ్డాయి. బస్తీలో ఉన్న ఇళ్లలోనూ వంట సామాగ్రి చెల్లా చెదురయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు జరగ్గా.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. గ్యాస్ సిలిండర్ (Gas Cylinder Blast) పేలినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News