BJP: ఇదొక చారిత్రాత్మక ఘట్టం..! పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్
నిజామాబాద్(Nizamabad), పసుపు రైతులకు(Turmeric Farmers) ఇదొక చారిత్రాత్మక ఘట్టం! అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister bandi Sanjay) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్(Nizamabad), పసుపు రైతులకు(Turmeric Farmers) ఇదొక చారిత్రాత్మక ఘట్టం! అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister bandi Sanjay) అన్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిని మంగళవారం కేంద్రమంత్రి పియూష్ గోయల్(Union Minister Piyush Goyal) ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృష్యాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ.. స్పెషల్ ట్వీట్ చేశారు. దీనిపై ఆయన.. నేషనల్ టర్మరిక్ బోర్డ్ కల ఇప్పుడు నిజమైనదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారని తెలిపారు. అలాగే ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు చొరవ చూపి, దాని అమలుకు భరోసా ఇచ్చినందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పసుపు రైతుల అభ్యున్నతికి పాటుపడటంలో ఎనలేని కృషి చేసిన ఘనత నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్(MP Dharmapuri Aravind) కి దక్కుతుందని చెప్పారు. ఇక పసుపు బోర్డుకు నూతనంగా నియమితులైన చైర్మన్ పల్లె గంగారెడ్డికి(Palle Ganga Reddy) అభినందనలు తెలియజేశారు. ఈ పసుపు బోర్డుకు నాయకత్వం వహించడంలో ఆయన గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను! అని బండి సంజయ్ రాసుకొచ్చారు.