BJP: రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని రుజువైంది.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నైజం మరోసారి బయటపడిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ(Malkajgiri MP) ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నైజం మరోసారి బయటపడిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ(Malkajgiri MP) ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. లగచర్ల ఘటనలో (Lagacharla Issue) జైలులో ఉన్న ఖైదీకి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించే సమయంలో సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈటల.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రైతుకు వేసిన బేడీలు.. మీ సర్కార్ కు ఉరితాళ్ళు అవుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం.. ఏనాడూ బాగుపడలేదనేది చరిత్ర రుజువు చేసిందని అన్నారు. అంతేగాక లగిచర్ల రైతు ఈర్య నాయక్ గుండె నొప్పితో ఉంటే కనికరం చూపాచాల్సింది పోయి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుందని, ఈ ఘటనతో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతు వ్యతిరేకి అని రుజువైందని ఈటల ఆరోపించారు.