BJP: కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి.. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

ప్రజలకు మోసం చేయడంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా కేసీఆర్(KCR) బాటలోనే నడుస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) ఆరోపించారు.

Update: 2024-12-04 09:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు మోసం చేయడంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా కేసీఆర్(KCR) బాటలోనే నడుస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) ఆరోపించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office)లో మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు అబద్దాలు.. 66 మోసాలు అని బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్జిషీట్(Charge Sheet) పెట్టారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, ఎందుకంటే అవి నిజంగా అబద్దాలు అని చెప్పారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నాయకుడు మేం కూడా చార్జిషీట్ పెడతామని మాట్లాడుతున్నాడని, ప్రతిపక్ష పాత్ర పోషించే తీరిక బీఆర్ఎస్(BRS Party) కు లేదని, ఆ పార్టీకి కాలం చెల్లిందని గుర్తించే కేసీఆర్(KCR) ఫాంహౌజ్ లో కాలం వెల్లదీస్తున్నాడని, మరో యువ కిశోరుడు విరామం తీసుకున్నాడని వ్యాఖ్యానించారు. అలాగే సుపుత్రిక కోలుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోందని, ఆయన కూడా ఇంట్లో కూర్చొని హరినామ స్మరణ చేసుకోకుండా చార్జీ షీట్ తేస్తానని మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.

అంతేగాక కాళేశ్వరం(Kaleshwaram), ఫోన్ ట్యాపింగ్(Phone Taping), డ్రగ్స్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ అంశాలలో మీపై ఉన్న చార్జీషీట్ కు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని, అలాగే వర్గీకరణ విషయంలో భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రిని అని చెప్పుకొని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సబ్ ప్లాన్ విషయంలో కేసీఆర్ పదేళ్లు పబ్బం గడుపుకొని, సబ్ ప్లాన్ కు తూట్లు పొడిచి, చివరి నిమిషంలో రాజకీయాల కోసం దళిత బంధుతో కాలం వెళ్లదీశాడని.. రేవంత్ రెడ్డి కూడా ఏడాది కాలంలో సబ్ ప్లాన్ ముచ్చటే లేకుండా కాలం గడిపాడని ఆరోపించారు. ఏ విషయంలో చూసినా కేసీఆర్ పదేళ్లు, రేవంత్ రెడ్డి సంవత్సరం కలిసే నడుస్తున్నాయని, కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి అని విమర్శలు చేశారు. ఇక ఈ విషయాలపై బహిరంగ చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు. అంతేగాక బీఆర్ఎస్ పార్టీకి చార్జిషీట్ లు పెట్టే అర్హత లేదని, ముందు వారిపై ఉన్న చార్జిషీట్లకు సమాధానం చెప్పాలని అన్నారు. 

Tags:    

Similar News