తెలంగాణకు రానున్న BJP కీలక నేత బీఎల్ సంతోష్!

బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు.

Update: 2022-12-16 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడ్రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్‌ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదికకానున్న విషయం తెలిసిందే. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై పలు అంశాలను నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారి, కన్వీనర్, ఫుల్ టైమర్, పాలక్‌లను కలిపి ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా హాజరవుతారని బీజేపీ శ్రేణులు తొలుత వెల్లడించారు. కాగా ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా రాకపోవచ్చని తాజాగా చెబుతున్నారు. దక్షిణాదిలో ప్రధానంగా నాలుగు రాష్ట్రాలపై బీజేపీ దృష్టిసారించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వీక్‌గా ఉన్న పార్లమెంట్ స్థానాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ తరగతులకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సైతం హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొయినాబాద్ ఫాంహౌజ్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీఎల్ సంతోష్ పేరును చేర్చింది. కాగా ఆయన తెలంగాణ పర్యటన రాజకీయంగా హీట్ పెంచనుంది.


Similar News