బిడ్డ మీద ప్రేమతో బీజేపీపై అక్కసు!.. కేసీఆర్ లైవ్ షోకి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్
టైటానిక్ షిప్ లా కుప్పకూలిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు బీఆర్ఎస ను నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అని, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టైటానిక్ షిప్ లా కుప్పకూలిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు బీఆర్ఎస ను నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అని, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఓ మీడియా చానెల్ కి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలపై లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చేసిన పాపాలకే ప్రజలు గత ఎన్నికల్లో శిక్షించారని, అందుకే పార్టీ నేతలతో పాటు కేడర్ కూడా దూరమవుతున్నారని అన్నారు. లిక్కర్ కేసుపై కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్దంగా రాజ్యాంగ సంస్థలు, కోర్టులను తప్పుపట్టే విధంగా ఉన్నాయని, బెయిల్ బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నించారు.
బిడ్డ మీద ప్రేమతో బీజేపీపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, ఆ కేసులో ఉన్నావాళ్లే లొంగిపోయి నిజాలు బయటపెడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని, ఆయన హోల్ సేల్ గా పార్టీ పిరాయింపులు ప్రోత్సహించి, మంత్రి పదవులు దిగజారుడు రాజకీయాలు చేశారని, బీజేపీ ఏ ప్రభుత్వాన్ని కూలదోయదని, 8 సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చేది ఎలా సాధ్యమని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమని చెప్పినట్లు తెలిపారు. అంతేగాక బీఆర్ఎస్ 17 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంటే గగనమని, ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదని, అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ గెలుస్తున్నామని, అలాగే సికింద్రాబాద్ లో గెలుపు ఖాయం అయిందని కేవలం మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.