హిందువులపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు వివాస్పదమవుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు వివాస్పదమవుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులు పిచ్చోళ్లు.. హిందువుల్లో మగతనం చచ్చిపోయిందంటూ మండిపడ్డారు. ఒక్క హిందూ పిచ్చోడు కూడా ఎందుకు మసీద్ మీద దాడి చేయడం లేదన్నారు. హిందువులకు సిగ్గు, శరీరం, రక్తం మరిగినప్పుడే దేవాలయాలపై దాడులు ఆగుతున్నాయన్నారు.
హిందు దేవతా విగ్రహాల ధ్వంసం జరిగిన సందర్భంలో పోలీసులు పిచ్చోళ్ళను నిందితులుగా చూపుతున్నారని, అలాగైతే నగరంలో ఉన్న లక్ష మంది హిందూ పిచ్చోళ్ళు మసీద్ లపై ఎందుకు దాడి చేయడం లేదని నిలదీశారు. ఆలయాలపై దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఇతర మతస్తులకు, ముఖ్యంగా ఒవైసీ సోదరులు ఆలయాలపై దాడులను ప్రోత్సహించకుండా చోరవ తీసుకుని మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.