అఖిలపక్ష సమావేశానికి BJP గైర్హాజరు.. ఎమ్మెల్యే ఏలేటి వివరణ

డీలిమిటేషన్‌(Delimitation)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశం(All-Party Meeting) నిర్వహించారు.

Update: 2025-03-17 12:59 GMT
అఖిలపక్ష సమావేశానికి BJP  గైర్హాజరు.. ఎమ్మెల్యే ఏలేటి వివరణ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్‌(Delimitation)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశం(All-Party Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఐఎం, సీపీఐ, ఎమ్ఐఎమ్ నేతలు హాజరు అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు గైర్హాజరు అయ్యారు. బీజేపీ(Telangana BJP) నేతల గైర్హాజరుపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) వివరణ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఆహ్వానం అందలేదని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఏవైనా ఉంటే ముందే సమాచారం ఇవ్వాలని అన్నారు.

ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్‌(Delimitation)పై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 22న చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) ఆహ్వానించారు. అయితే.. ఈ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

Tags:    

Similar News