ఆగస్టు 6న బహిరంగ సభ నిర్వహిస్తాం.. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-07-23 12:32 GMT
ఆగస్టు 6న బహిరంగ సభ నిర్వహిస్తాం.. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై ఆగస్టు 6న బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను పుస్తక రూపంలో తీసుకురానున్నట్లు చెప్పారు. రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, టీచర్లు, లెక్చరల్లు, రైతులు, యువత.. ఇలా ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాచరికపు పోకడలతో, అహంకారంతో కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తే వ్యక్తులు, సంస్థలపై దాడులు చేస్తూ హక్కుల హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ధరణి వల్ల రైతులు చాలా కష్టాలు పడ్డారని, ధరణి సమస్యలపై ప్రత్యేక కమిటీ వేస్తామని తెలిపారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మారిందని అన్నారు. బడా కంపెనీ నేతలకు అతి తక్కువ ధరకే ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారు.

Tags:    

Similar News