TG: గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు.

Update: 2025-03-05 14:30 GMT
TG: గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి(Anji Reddy) విజయాన్ని దక్కించుకున్నారు. కాసేపట్లో దీనిపై అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.

మరోవైపు ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25,041 ఓట్లు పోలవ్వగా.. అందులో 897 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మొత్తం చెల్లుబాటు అయిన 24,144 ఓట్లలో బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. ఇక పీఆర్‌టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక అశోక్‌ కుమార్‌కు 2,621 ఓట్లు వచ్చాయి. దీంతో వరుస విజయాలతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Tags:    

Similar News