టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

త్వరలో జరగనున్న మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది.

Update: 2023-02-14 07:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో జరగనున్న మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డిని బరిలోకి దింపబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సైతం ఇదే షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరగనుంది. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట్లో జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు హాట్ టాపిక్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కాగా రాబోయే జనరల్ ఎలక్షన్ విధుల్లో టీచర్లు కీలకం కావడంతో అన్ని పార్టీలు వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ సారి ప్రైవేట్ టీచర్లకు సైతం ఓటు హక్కు కల్పించడంతో పోటీ హోరా హోరీగా సాగే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 

Tags:    

Similar News