Crime news: ముగ్గురు పిల్లల తల్లి ఇద్దరు యువకులతో లవ్ ట్రాక్!.. డబుల్ మర్డర్ కేసులో ట్విస్ట్
నార్సింగి డబుల్ మర్డర్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ (Puppala Guda) జంట హత్యల కేసులో (Double murder case) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఈ దారుణానికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న అనంత పద్మనాభ స్వామి ఆలయగుట్టల వద్ద శవాలుగా కనిపించిన మహిళ, యువకుడిని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన యువకుడు మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత సాకేత్ గా మృతురాలు ఛతీస్ గఢ్ కు చెందిన బిందు(25)గా గుర్తించారు. సాకేత్ హౌస్ కీపింగ్ పనిచేస్తూ నానక్ రామ్ గూడలో నివాసం ఉంటున్నారు. భర్త చత్తీస్ గఢ్ లో నివాసం ఉండగా బిందు హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసం ఉంటోంది. ఈనెల 3వ తేదీ న బిందు అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాణాలు తీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ!:
ముగ్గురు పిల్లలు కలిగిన బిందుకు అంకిత్ సాకేత్ (Ankit Saket) తో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమసంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఈ నెల 11న బిందు (Bindu)ను ఎల్బీ నగర్ నుంచి నానక్ రామ్ గూడకు సాకేత్ పిలfపించాడు. అక్కడే తన స్నేహితుడి రూమ్ లో బిందును ఉంచాడు. ఆ మరుసటి రోజు ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఆ జంట ఏకాంతంగా గడిపింది. అయితే సాకేత్ కు తెలియకుండా బిందు మరో యువకుడితో లవ్ ట్రాక్ నడుపుతోంది. సాకేత్, బిందు కలిసి ఉండటాన్ని చూసిన మరో యువకుడు కోపంతో బిందును దారుణంగా హత్య చేశాడని పారిపోతున్న సాకేత్ ను సైతం వెంటాడి మరీ కిరాతకంగా హత్యచేసి ఉండాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.