ప్రీతి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫోరిన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు..!

కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2023-03-05 17:39 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రీతి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ (విషవాయువులు) లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్టులో వెల్లడించింది. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ఫొరెన్సిక్ రిపోర్టుతో రూఢి అయింది. దీంతో ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అంటూ వాదిస్తూ వస్తున్నవారి మాటే నిజమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన తాజా నివేదికతో ప్రీతిది హత్యేననే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News