బిగ్ అలర్ట్: మొదలైన వర్షం.. రెండు గంటల్లో నగరంలో భారీ వర్షం
ఆదివారం మధ్యాహ్నం వరకు తెలంగాణ రాష్ట్రం అంతటా.. తీవ్రమైన వేడి నెలకొంది. ముఖ్యంగా ఉత్తర తూర్పు తీరంలో 44°C వేడి నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం మధ్యాహ్నం వరకు తెలంగాణ రాష్ట్రం (Telangana State) అంతటా.. తీవ్రమైన వేడి నెలకొంది. ముఖ్యంగా ఉత్తర తూర్పు తీరంలో 44°C వేడి నమోదైంది. అలాగే హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఉదయం నుంచి కొట్టిన ఎండల కారణంగా నగర శివారు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం (weather) మారిపోయింది. దీంతో మేడ్చల్, తుర్కపల్లి, శామీర్ పేట, అలియాబాద్, తూముకుంట, కీసర వంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షం (Brought rain) పడుతుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎండ దంచికొడుతున్నప్పటికి మేడ్చల్ ప్రాంతం నుంచి వస్తున్న మేఘాలు (clouds) నగరాన్ని కమ్మెసీ.. మరో రెండు గంటలు లేదా సాయంత్రానికి నగర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం (RAIN) కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు.