ఆ భూములకు రైతు భరోసా ఇవ్వమని తేల్చి చెప్పిన భట్టి విక్రమార్క

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది.

Update: 2024-03-09 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఒక్కోక్కటిగా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా అమలు చేస్తున్న పథకాలపై దృష్టి సారించి.. అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతు భరోసా అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును ఐదు నెలలపాటు ఇచ్చింది. అలాగే యాసంగి రైతుబంధు నాలుగు నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎన్నడూ ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఐదు ఏకరాల్లోపు అర్హుల ఖాతాలో రైతు భరోసా డబ్బును జమ చేసిందని తెలిపారు. ప్రస్తుతానికి పాత డేటా ప్రకారం రైతుబంధు ఇస్తున్నామని.. కొండలు గుట్టలు రోడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకుందని డిప్యూటీ సీఎం భట్టి తేల్చి చెప్పారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో అప్పనంగా కొండలు, గుట్టల, చేరువుల భూముల పేరు మీద రైతుబంధును తీసుకున్న వారికి షాక్ తగిలినట్టైంది.


Similar News