ఆత్మ లేని శరీరంలా ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లు: MLC Kavitha Kalvakuntla

మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పనపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

Update: 2023-09-20 16:16 GMT
ఆత్మ లేని శరీరంలా ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లు: MLC Kavitha Kalvakuntla
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పనపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోఛనీయమని అన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మహిళలు రిజర్వేషన్లపై మరో ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సి రావడం బాధాకరం అన్నారు. ఆత్మ లేకుండా శరీరంలా ఈ బిల్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ వర్గం మహిళలైనా వెనుకబడేస్తే దేశం ముందుకు ఎలా వెళ్లగలుగుతుందో బీజేపీ ప్రభుత్వమే ఆలోచించాలని సూచించారు. సబ్ కా వికాస్ సబ్ కా సాత్ అంటున్న బీజేపీ నినాదంలో బీసీ మహిళలను చేర్చకపోవడం శోచనీయమన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారన్నారు.

Tags:    

Similar News