చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పై బండ్ల గణేష్ ఆసక్తికర పోస్ట్!

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి మారుతున్నారు.

Update: 2024-03-16 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కీలక నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. అయితే చేవెళ్ల ఎంపీ టికెట్ సిట్టింగ్ రంజిత్ రెడ్డికి కాదని, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు టికెట్ ప్రకటించారు. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని చర్చానీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే శనివారం ట్విట్టర్ వేదికగా ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ రంజిత్ రెడ్డిపై ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు సైతం రంజిత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాయి. కాగా, బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డి వద్దనుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దీంతో టికెట్ కాసాని కి ఇవ్వాల్సి వచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..