దిశ, తెలంగాణ బ్యూరో: బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం లక్డికాపూల్‌లో ఉదయం 9.30 గంటలకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గన్ పార్క్ వద్ద ఉదయం 10. 30 గంటలకు నివాళులు అర్పించి, పదేళ్ల కాలంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, దోపిడీ గురించి మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా మే 27వ తేదీన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.