మత కల్లోలాలు సృష్టించేందుకు దాడులు : ఎంపీ డీకే అరుణ

మత కల్లోలాలు సృష్టించేందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.

Update: 2024-11-23 09:42 GMT

దిశ,షాద్ నగర్ : మత కల్లోలాలు సృష్టించేందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. షాద్ నగర్ ఫరక్ నగర్ లో వివేకానంద కాలనీ బసవన్న దేవాలయ ఆవరణలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ఎత్తుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేవాలయాలపై దాడులు చేయడం వికృతమైన చర్యలని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గుర్తు తెలియని దుండగులు శివుని ప్రతిష్టను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు.

దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రతి గుడి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేవాలయాలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, చెట్ల వెంకటేష్, ఎంకనోళ్ళ వెంకటేష్, కాసోజు శివ, ఆకుల ప్రదీప్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

షాద్ నగర్ చౌరస్తాలో ధర్నా

హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా హిందూ దేవుళ్ళ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేయడం దారుణమైన విషయమని హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. ధ్వంసం చేసినందుకు నిరసనగా షాద్ నగర్ చౌరస్తాలో బజరంగ్ దళ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ షాద్నగర్ ఏసిపి రంగసామి నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించి ధర్నా చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Similar News