MLC కవితపై అసభ్యకర ట్రోల్స్.. వెనుక ఉన్నది ఎవరు?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిపై ట్రోల్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులపై ట్రోల్స్ చేయడం పరిపాటిగా మారిపోయింది.

Update: 2023-03-19 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిపై ట్రోల్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులపై ట్రోల్స్ చేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై దారుణంగా ట్రోల్స్ రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ, బీఆర్ఎస్‌కు అనుకూల, ప్రతికూల పోస్టర్లు అతికిస్తున్నారు. ప్రస్తుతం ఈ పొలిటికల్ ట్రోల్స్ శృతిమించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కవిత విషయంలో కొంతమంది ట్రోలర్స్ హద్దు మీరడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసభ్యకర రీతిలో కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్స్ చేస్తుండటంపై బీఆర్ఎస్ సానుభూతిపరులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు వీటిపై వెంటనే స్పందించాలని అసభ్యకర రీతిలో ట్రోల్స్ చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ వెనుక ఉన్నది ఎవరు? వీటి వెనుక రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే కుట్రలేమైనా ఎదుటి వర్గాల నుంచి జరుగుతోందా అనేది పార్టీల మధ్య చర్చగా మారింది. కాంగ్రెస్ వార్ రూమ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన పోలీసులు తాజాగా కవితపై జరుగుతున్న ట్రోల్స్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News