దారుణం.. కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
పెద్దపల్లి జిల్లా మంథనిలో మండలం భుట్టపల్లిలో దారుణం చోటు చేసుకుంది.
దిశ, కరీంనగర్ బ్యూరో: కన్న కూతురిని అతికిరాతకంగా గొడ్డలితో కసాయి తండ్రి నరికి చంపడం కలకలం రేపింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది. మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన సదయ్య తన పదేళ్ల కూతురు రజితను గురువారం ఉదయం దారుణంగా హత్య చేశాడు. కన్న కూతురిని హత్య చేసిన సదయ్య పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన ధూపం శ్రీనివాస్ అనే వ్యక్తిపై సైతం దాడి చేశాడు. అయితే సదయ్య మానసిక పరిస్థితి బాగుండదని స్థానికులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.